JGL: యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో పాట రచించడం అభినందనీయమని, జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ పట్టణంలో వేణు రచించిన ఎత్తురా జెండా పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి అనిల్ కుమార్, ఉదయశ్రీ, రాణి, సాయికుమార్, శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్, మహేందర్, ప్రశాంత్ రావు, రాంప్రసాద్ పాల్గొన్నారు.