మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం యన్మన్ గండ్లలో రెండు రోజుల క్రితం జరిగిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబకులు యువకుడి అన్న రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.