BHPL: చేర్యాల మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల జూ. కళాశాలలో ఇంగ్లీష్, నర్సింగ్ బోధించేందుకు అతిథి మహిళా అధ్యాపకుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి తెలిపారు. ఇంగ్లిష్ బోధించుటకు పీజీ, నర్సింగ్ బోధించుటకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈనెల 4 నుంచి 9 వరకు సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.