MDK: నర్సాపూర్ ఏరియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఏరియా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. శాశ్వత భవన ఏర్పాటుపై యూనియన్ సభ్యులు, మెడికల్ షాపుల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్ బలోపేతానికి, సభ్యుల సౌకర్యార్థం ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

