కడప నగరంలో ఇళ్ల కూల్చివేతలతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని MLA మాధవి రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. భూవివాదాలను తాము పరిష్కరించబోమని, అర్ధరాత్రి కూల్చివేతలు సరికాదని, బాధ్యులపై చర్యలు తప్పవని ఆమె అన్నారు. ప్రజా సంఘాలు అసత్య ఆరోపణలు చేయవద్దని, గంజాయిపై అసెంబ్లీలో పోరాడుతున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

