W.G: పెనుగొండ మండలంలోని ఇలపర్రు సొసైటీ వద్ద ఇవాళ రైతులకు ఎలుకల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ కేతా సత్యనారాయణ మాట్లాడుతూ.. పంట పొలాల్లో ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సొసైటీల ద్వారా ఈ మందును అందిస్తోందన్నారు. రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

