RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి నేడు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ పేరును బ్యానర్లో మర్చిపోయారు. దీంతో సర్పంచ్ వర్గం, బీఆర్ఎస్ నాయకులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పును గ్రహించి వెంటనే బ్యానర్‌ను మార్చారు.

