సత్యసాయి: హిందూపురంలోని మున్సిపల్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నేటి యువత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

