VZM: రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీపై రాజాంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శిక్షణా కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

