SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను పునరుద్ధరించాలని CPM జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్ చేశారు. ఇవాళ ఎచ్చెర్ల లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నిరసన చేపట్టారు. గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలు, రైతులు, కూలీలకు అండగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

