VSP: మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇస్కఫ్ విశాఖ జిల్లా సమితి శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సమితి అధ్యక్షులు సి.ఎన్.క్షేత్రపాల్ రెడ్డి మాట్లాడుతూ…. గాంధీజీ అహింస, సత్యం, సత్యాగ్రహ సూత్రాలు ప్రపంచానికి శాంతి మార్గం చూపించాయని అన్నారు. మతసామరస్యం, సామాజిక న్యాయం ఆయన ఆలోచనలు నేటికీ మార్గదర్శకాలన్నారు.

