AP: లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని రెండు జాతీయ ల్యాబ్ రిపోర్ట్లు తేల్చాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన పాపం చంద్రబాబుదేనని మండిపడ్డారు. టీడీపీ విష ప్రచారాన్ని తిప్పకొట్టడానికే తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. తప్పు చేశామని ఒప్పుకునే విచక్షణ చంద్రబుబుకు లేదని విమర్శించారు.

