W.G: పాలకొల్లు నియోజకవర్గ ఇనఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ వైసీపీ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా కెల్లా పెద్దిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గోపి పిలుపునిచ్చారు.

