గుంటూరు పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు శుక్రవారం జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు చేరుకున్న సీఎంకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ అన్సారియా పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల గురించి సీఎం ఆరా తీశారు.

