PPM: వీరఘట్టం సమీపంలో మరియగిరి వద్ద శుక్రవారం జరగనున్న మేరీమాత ఉత్సవంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సిబ్బందికి సూచించారు. గురువారం యాత్ర ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లుపై ఎస్సై షణ్ముఖరావుతో మాట్లాడారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరియగిరి ఫాదర్స్ కు చేప్పారు.

