KMM: కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ ఉమారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏకగ్రీవానికి సహకరించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు.