GDWL: పాల ఉత్పత్తిదారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు. గద్వాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విజయ డైరీ ద్వారా ప్రభుత్వమే నేరుగా పాలను సేకరించాలన్నారు. ప్రైవేట్ దోపిడీని అరికట్టి, రైతులకు వారానికోసారి చెల్లింపులు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.