BDK: భద్రాచలం ఇసుక ర్యాంపు వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బుధవారం జరిపిన తనిఖీల్లో 33.6 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయిని గుర్తించిన పోలీసులు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు 18004252523 ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.