ADB: గణేష్ నిమజ్జనంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో గడపాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని తేజపూర్ గణేష్ మండపాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు, తదితరులు ఉన్నారు.