యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరిసంహస్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి మాలదారులకు మొట్టమొదటి సారిగా ఈనెల 11న ఉదయం 6 గంటలకు స్వామి వారి గిరిప్రదక్షణను ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. గిరిప్రదక్షణ అనంతరం ఈరోజు ఉదయం 7 గంటల నుండి 8.45 వరకు స్వాములందరికి ప్రత్యేకంగా గర్భాలయ దర్శనంతో పాటు, ప్రత్యేక ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.