VZM: మెంటాడ మండలం జయతి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నెక్కల శ్రీను సుమారు రూ. 70,000 ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బుతో పరారయ్యాడని ఇంఛార్జ్ ఎంపీడీవో విమలకుమారి శనివారం చెప్పారు. గ్రామంలో పింఛన్ దారుల నుంచి వేలిముద్రలు తీసుకొని వెంటనే పింఛన్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా నగదు ఇంకా రాలేదని, వేలిముద్రలు పడలేదని సాకులు చెప్పినట్లు తెలిపారు.