SRD: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసు ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సంబంధిత అధికారులకు MLA మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు శివారు కంపెనీలు, పారిశ్రామికవాడలో వీటి వినియోగం ఎక్కువగా సాగుతుందని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.