RR: ఓటు వేసేందుకు ఓటర్ కార్డు తప్పనిసరి కాదని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, 100 రోజుల పని కార్డు, పాస్ పోర్టు ఇలా జాతీయ గుర్తింపు కలిగిన ఏ కార్డుతో అయినా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. RR జిల్లాలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు.