NZB: ఆర్మూర్ డివిజన్లో 1200 వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుందని ACP వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే నిజామాబాద్ టౌన్ నుంచి 1500 విగ్రహాల్లో మెజార్టీవి బాసర కంటే ఎక్కువగా నందిపేట్ మండలంలోని ఉమ్మెడకే వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్మూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా నిమజ్జనాలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.