KMR: బీర్కూరు మండల కేంద్రంలో గురువారం పశువైద్యాధికారి మారుతి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ పశువులకు రోగాలు సోకకుండా ఉండేందుకు ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. పశు సంపదను కాపాడుకోవడానికి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఎ మెహబూబ్, వెంకటేశ్, సిబ్బంది లింగం, సాయిలు ఉన్నారు.