MNCL: బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల రైతువేదికలో దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసినట్లు రూరల్ CI హనోక్ తెలిపారు. CI వివరాల ప్రకారం.. ఆదివారం పోచమ్మ గడ్డ వద్ద తనిఖీలు చేస్తుండగా ఆటోలో TV, సౌండ్ బాక్స్‌లు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. నేరస్తులను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు రిమాండ్ కొరకు హాజరు పరిచామన్నారు.