KMR: పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద ఈ నెల 11న మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు.. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వను ఆమె కుమారుడు బాలయ్య స్నేహితుడితో కలిసి ఈ నెల 8న రాత్రి మంజీరాలోకి తోసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితులిద్దరిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.