GNTR: గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, జిల్లా పోలీస్ అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.