మహిళల హాకీ ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో చైనా, భారత్‌పై 4-1 తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ను గెలుచుకుంది. మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నప్పటికీ, చివరి అర్ధభాగంలో చైనా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి వరుసగా మూడు గోల్స్ చేసింది. దీంతో చైనా మూడోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.