SRCL: ఎల్లారెడ్డిపేట మండలందుమాల గ్రామ సమీపంలోని వంతెన అప్రోచ్ రోడ్డు అధ్వానంగా మారడంతో అక్కపెల్లి గ్రామస్థులు చొరవ తీసుకున్నారు. వాహనదారుల ఇబ్బందులు గుర్తించి, సొంత ఖర్చులతో ట్రాక్టర్ సహాయంతో గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు. రోడ్డును బాగు చేసిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.