KNR: నగరంలోని కల్పన హోటల్ సమీపంలో బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. వ్యక్తిని గంగాధర మండలం హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. స్థానిక వన్ టౌన్ పోలీసులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.