JGL: కథలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని, అందుకు అవసరమైతే నిధులు కేటాయిస్తామని మార్కెట్ కమిటీ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు. కథలాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సర్వసభ్య సమావేశం జరిగింది. మార్కెట్ యార్డులో చేపట్టే అభివృద్ధి పనులకు విద్యుత్ స్తంభాలు అడ్డుగా వస్తున్నాయన్నారు.