AP: మెగా DSC ఫైనల్ లిస్ట్‌ను రేపు విద్యాశాఖ విడుదల చేయనుంది. తద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. జూన్ 2 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ.. ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తి చేసింది. కాగా రేపు ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసి ఈ నెల 19న నిర్వహించే కార్యక్రమంలో CM చంద్రబాబు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు.