ప్రకాశం: పాలకులు పట్టణాలను కార్పొరేట్ దోపిడీ కేంద్రాలుగా మారుస్తున్నాని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబురావు విమర్శించారు. ఆదివారం ఒంగోలు సుందరయ్య భవనంలో జరిగిన నగర కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ రంగాన్ని లాభాల సాధనంగా మార్చుకున్నాయని, సామాన్యులకు గృహవసతి దొరకడంలేదన్నారు.