MDK: రామాయంపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక నిలువలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మూడు ఇసుక విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన అధికారులు సుమారు 20 ట్రాక్టర్ల ఇసుక నిలువలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.