NZB: ఉమ్మడి జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,905 మంది విద్యార్థులకు 1,813 మంది హాజరు కాగా, 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆర్మూరులో ఇద్దరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ డిబార్ అయ్యారన్నారు.