BDK: భద్రాచలంలో శనివారం జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు. ఉదయం 10:40 గంటలకు భద్రాచలం చేరుకొని, 11 గంటలకు రామయ్యను దర్శించుకుంటారు. 11:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మిథిలా స్టేడియంలో జరిగే పట్టాభిషేక వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించి తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.