భారత జనాభా గణన–2026కు సంబంధించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల కారణంగా నిర్మల్ కలెక్టరేట్లో నేడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని తహశీల్దారులు, ఎంపీడీవోల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.