PDPL: సింగరేణి RG-1లో మంత్లీ రేటెడ్ ఉద్యోగులకు క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కాలనీలలోని ఖాళీలను గ్రేడ్ల ప్రాతిపదికన పారదర్శకంగా కేటాయించారు. సీ నుంచి ఏ గ్రేడ్ వారికి 21 క్వార్టర్లు, ఏ-1 నుంచి హెచ్ గ్రేడ్ వారికి 4 క్వార్టర్లను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.