SRD: మండల కేంద్రమైన కంగ్టిలో శనివారం రాత్రి గణేష్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో పలికింది. సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలోని లడ్డును ముస్లిం కు చెందిన వ్యక్తి మోహిన్ తో పాటు విజయ్, వీర్ శెట్టి, పవన్ వేలం పాటలు పోటీపడి చివరికి నలుగురు కలిసి రూ.1 లక్ష 11 వేల 111కు 8 కిలోల బరువు గల గణేష్ చేతిలోని లడ్డును సొంతం చేసుకున్నారు.