KMM: చింతకాని మండలం నాగిలిగొండ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాక్కపూడి వెంకట్ (45) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందారు. పొలం నుంచి ఇంటికి వస్తున్న వెంకట్, బీటి రోడ్డు పనులకు మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ వెనక్కి రావడంతో దాని కింద పడిపోయారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.