KMM: నేలకొండపల్లి మండలంలోని చెరువు మాధారంలో కుక్కలు దాడి చేయగా లేగ దూడ మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు తెల్లగొర్ల అనిల్ అప్పుడే పుట్టిన లేగదూడను శనివారం పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. ఈ క్రమంలో కుక్కల గంపు దాడిచేసి దూడను ఈడ్చుకెళ్లడంతో చనిపోయింది. మరికొన్ని పశువుల వెంట పడడంతో స్థానికులు స్పందించగా కుక్కలు పారిపోయాయి.