నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల మత సామరస్యాన్ని ప్రమోట్ చేసేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ముస్లింల మత పెద్దలు, ప్రముఖులు పాల్గొని భిన్న మతాల మధ్య ఐక్యతను చాటనున్నారు. మీడియా ప్రతినిధులు సాయంత్రం 5:45 గంటలకు కార్యక్రమ వేదికకు చేరుకోవాలని సూచించారు.