HYD: హైదరాబాద్‌ను అధునాతన వైద్య పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బోర్పట్లలో రూ.1,200 కోట్ల థెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్‌ను ప్రారంభించిన ఆయన, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్లు, క్యాన్సర్ చికిత్సల రంగాల్లో తెలంగాణను ప్రపంచస్థాయి గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.