GDWL: కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సుధాబాయి, నరసింహులు దంపతుల కుమార్తె నందిని (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే రాయచూర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.