WGL: నర్సంపేట డివిజన్‌కు చెందిన ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మిక శాంతిని, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రంజాన్ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు.