ADB: గుడిహత్నూర్ మండలంలోని తోషం తాండ గ్రామానికి చెందిన జాదవ్ గేను ఇళ్లు శనివారం జరిగిన షాట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం కాలిన ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. ఆందోళన చెందొద్దని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.