MNCL: ప్రభుత్వ నిర్ణయం కోసం లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు అన్ని పార్టీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన ఆశావాహులను రిజర్వేషన్ నిరాశపరిచాయి. ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని హైకోర్టు కొట్టి వేసింది. దీంతో రిజర్వేషన్ల ద్వారా అవకాశం వచ్చిన వారు కూడా నిరాశకు లోనయ్యారు.