PDPL: మంథని మండలం చిన్న ఓదాలలో హనుమాన్ ఆలయానికి వెళ్లే సీసీ రోడ్డు పనులను సర్పంచ్ నాగుల శారద ప్రారంభించారు. రహదారి నిర్మాణం కోసం ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల శ్రవణ్, వార్డు సభ్యుల దువాసి సదయ్య, వేముల సమత, ముత్యాల లక్ష్మణ్, పల్లె హర్షణ పాల్గొన్నారు.