BDK: భద్రాచలంలో దేవస్థానం, ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలను అరికట్టాలని ఆదివారం సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పలుకుబడితో భూములు ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన చట్టాల అమలులో లోపాలు ఉన్నాయని విమర్శించారు. పెసా చట్టం ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.